కోవిడ్ లో విద్యాకార్యదర్శిల సేవలు అమోఘం..


Ens Balu
3
Visakhapatnam
2021-06-10 14:31:56

కోవిడ్-19 కాలంలో విద్యా కార్యదర్శుల సేవలు మరువరానివని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు అన్నారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ డి.ఇ.ఒ. శ్రీనివాస్,   వార్డు సచివాలయ విద్యా కార్యదర్శులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా తీవ్రస్థాయిలో ఉన్న కాలంలో ధైర్యంతో విద్యా కార్యదర్శులు 104కాల్స్ ను తీసుకోవడం, మొబైల్ వ్యానుల ద్వారా సచివాలయ పరిధిలో కరోనా సోకిన వారికి   సేవ చేయడం, ప్రతి పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ టెస్టులుకు ఐ.డి. క్రియేట్ చేయడం, వ్యాక్సినేషన్ సెంటర్లో ఆధార్ రిజిస్ట్రేషన్ చేయడం వంటి పనులు చాల బాగా నిర్వహించారని కొనియాడారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలు పై స్పందిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తామని అందరు సర్వీసు రిజిస్టర్లు తెరవాలని, ఇంకా సర్వీసు రిజిస్టర్లు తెరవని వారు వెంటనే అధికారులకు తెలియాజేయాలని తెలిపారు. కార్యదర్శులు మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రజల నుంచి మన్ననలు పొందాలని తెలిపారు.
అనంతరం డి.ఇ.ఒ. శ్రీనివాస్ మాట్లాడుతూ కోవిడ్ లాంటి కష్టకాలంలో విద్యా కార్యదర్శులు నిబద్దతతో పనిచేసి కరోనా కట్టడికి కృషి చేశారని తెలిపారు. సచివాలయాలలో కార్యదర్శులకు అవసరమైన మౌళిక  సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని, త్వరలోనే మీ ద్వారా నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడతామని తెలిపారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  డి.ఇ.ఒ. శ్రీనివాస్, వార్డు సచివాలయ విద్యా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు