లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు..


Ens Balu
2
Guntur
2021-06-10 15:33:12

గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్బస్థ పూర్వ,  గర్భస్థ దశలో పరీక్ష నిర్దారణ నిరోధక చట్టం -1994 సంవత్సరం మరియు దీనికి సంబంధించిన నిబంధనలు 1996 సంవత్సరం  నుంచి అమలు చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జె. యాస్మిన్ పేర్కొన్నారు.   గురువారం స్థానిక జిల్లా  వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని  డియం అండ్ హెచ్ ఓ  ఛాంబర్ లో పీసీ అండ్ పీఎన్డిటీ జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జె.యాస్మిన్ అధ్యక్షతన  జరిగింది.  ఈ సమావేశంలో డా. జె. యాస్మిన్ మాట్లాడుతూ క్రొత్త స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ పై డియం అండ్ హెచ్ ఓ కు సమాచారం ఇవ్వవలసి వుంటుందన్నారు. ప్రతి స్కానింగ్ సెంటర్ ను 5 సంవత్సరాలకొకసారి రెన్యూవల్ చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ లేని స్కానింగ్ సెంటర్స్ ను రద్దు చేయడం జరుగుతుందన్నారు.  స్కానింగ్ సెంటర్లలో సిబ్బంది మార్పు జరిగినప్పుడు, క్రొత్త స్కానింగ్ మిషన్స్  కొనుగోలు అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. జిల్లాలో 23 హోస్పిటల్స్ క్రొత్త రిజిస్ట్రేషన్స్ కొరకు, రెన్యూవల్ కొరకు 30 దరఖాస్తులు వచ్చాయన్నారు.  మిషన్స్  మార్పులు చేర్పుల రిజిస్ట్రేషన్స్ కొరకు 22 దరఖాస్తుల అందగా,  అనుమతి  కొరకు జిల్లా అప్రాప్రియేట్ ఆధారీటీ వారికి పంపడం జరిగింద న్నారు.  జిల్లాలో స్కానింగ్ సెంటర్స్ 372  ఉన్నట్లు తెలిపారు. ఏవైనా రిజిస్ట్రేషన్స్ లేని  స్కానింగ్ సెంటర్స్  వెనువెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. లేని పక్షంలో అలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్కానింగ్ సెంటర్స్ లో పరీక్షలు చేసేటప్పుడు  పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయ అనే విషయం తల్లితండ్రులకు తెలియజేస్తున్నట్లు వైద్యాధికారి  దృష్టికి వస్తే  స్నానింగ్ సెంటర్స్ ను తనిఖీలు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్కానింగ్ సెంటర్స్ లో అవకతవకలు జరుగుతున్నట్లు తెలిసినా   టోల్ ఫ్రీ నెంబర్ 102, 104 కి ఫోన్ చేసి సమాచారం అందించ వచ్చాన్నారు. అటువంటి స్కానింగ్ సెంటర్ల పై సెక్షన్ల వారీగా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.  
  ఈ సమావేశంలో జిల్లా నోడల్ అధికారి టీ. జయసింహా, గైనకాలజిస్ట్ హెచ్ ఓడి డా. పి.చంద్ర శేఖర్, పిల్లల డాక్టర్ జిజిహెచ్ డా. ఆర్. గిరీష్, అసిస్టెంట్ ప్రోపిసర్ మెడికల్ కళాశాల డా. సిహెచ్. సుధాకర్,  ఐద్వా తరపున ఎల్. అరుణ,  సీడ్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.