శ్రీకాకుళం జిల్లాలో ఏ ఏ రైతుకు ఏ ఏ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు కావాలో మండలాల వారీగా తెలియజేయాలని వ్యవసాయ శాఖ జెడి ని జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ధరలపై కంపెనీ డీలర్లుతో కమిటీ తో ఆయన సమావేశం నిర్వహించారు. పరికరాలకు సంబంధించిన 40 శాతం సబ్సిడీ రైతులకు వస్తుందని ఆయన చెప్పారు. పరికరాల తయారీ దారులతో ధరలపై మాట్లాడాలన్నారు. డీలర్లు ఫైనల్ ధరలను తెలియజేశారు. డిసిసిబి బ్యాంకు నుండి బుణం ఆలశ్యం లేకుండా చూడాలని సిఇఓ కు చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జెడి కె. శ్రీధర్, ఆగ్రోస్ డిఎం కె. జగన్ మోహన్ రావు హార్టీ కల్చర్ ఎడి, రాగోలు వ్యవసాయ కేంద్రం ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ, డిడి రాబర్ట్ పాల్, ఆయా కంపెనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.