ఆపదలో ఆదుకున్నవారే నిజమైన దేవుళ్లు..
Ens Balu
3
Visakhapatnam
2021-06-10 17:14:03
కరోనా లాంటి ఆపద సమయంలో సహాయం చేయడానికి ముందుకి వచ్చిన దాతలు పేదల పాలిట నిజమైన దేవుళ్లని, అలాంటి వారి మేలు మరువరాదని ద్రోణంరాజు శ్రీవాత్సవ పేర్కొన్నారు. గురువారం విశాఖలోని 1 టౌన్ జగన్నాధస్వామి ఆలయంలో దివంగత ద్రోణంరాజు శ్రీనివాసరావు జ్ఞాపకార్ధం వైజాగ్ బ్రాహ్మిన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేద అర్చకులకు నిత్యవసర సరుకుల పంపిణీ నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ, సంఘం గౌరవాధ్యక్షులు టిఎస్సార్ పర్యవేక్షణలో ఇలాంటి మంచి కార్యక్రమం నాల్గవ దఫా చేయడం ఆనందంగా వుందన్నారు. కరోనా సమయంలో నిరుపేద అర్చకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారిని ఆదుకోవడానికి ముందుకి వచ్చిన సంఘం సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కావురు చరణ్ కుమార్ , లక్ష్మీ కన్నతల్లి, కె. రాంభద్రుడు ,శంకర్ నీల్, విప్పాని మురళీకృష్ణ , ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాదాచార్యులు , ఆనంతాచార్యులు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.