0-5 పిల్లల తల్లులకు కోవిడ్క్సి వేక్సినేషన్..
Ens Balu
2
Srikakulam
2021-06-10 17:18:35
శ్రీకాకుళం జిల్లాలో 0 -5 ఏళ్ల వయస్సులోపు గల పిల్లల తల్లులకు కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఇపుడే పుట్టిన బిడ్డ నుండి ఐదేళ్లలోపు వయస్సు గల పిల్లల తల్లులకు వేక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన సందర్భంగా భాగంగా 0-5 ఏళ్ల వయస్సులోపు గల పిల్లల తల్లులకు జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్యురాలు డా. యస్.కె.చాందిని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వేక్సినేషన్ తీసుకున్న తల్లులు వారం రోజుల పాటు తగు జాగ్రత్తలు పాటించాలని, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. అలాగే బలవర్ధకమైన ఆహారం, తాజా కాయగూరలు, పండ్లు తీసుకోవాలని చెప్పారు. వారంలోగా తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే పారసిటామాల్ మాత్రను మాత్రమే తీసుకోవాలని, ఇతర మందులు ఏమీ తీసుకోరాదని ఆమె సూచించారు. ఇంటివద్ద నున్న తల్లులు బరువైన పనులు మాని, తేలికపాటి పనులను మాత్రమే చేసుకోవాలని అన్నారు. ఇతర సమస్యలు ఏమైనా తలెత్తితే దగ్గరలోని వైద్యుని సంప్రదించాలని ఆమె తల్లులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ బి.విశ్వేశ్వరరావు, సూపర్ వైజర్ ఆర్.జె.నాయుడు, యన్.అప్పలరాజు, యస్.సంపత్ మరియు ఇతర సచివాలయ సిబ్బంది కలిసి ఇపుడే పుట్టిన బిడ్డ నుండి ఐదేళ్ల లోపు గల పిల్లల తల్లులకు వేక్సినేషన్ చేశారు.