అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె. వెంకట రావు కలెక్టర్ కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జె. వెంకట రావు మాట్లాడుతూ బాల కార్మికులను నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ, యునిసెఫ్ లెక్కల ప్రకారం బాలకార్మికులు 160 మిలియన్ పెరిగినట్లు నివేదికలు ఇవ్వడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు.కరోనా సమయంలో తల్లిదండ్రులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో బాలలు కార్మికులుగా మారిపోయే ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి. పిల్లలను పనిలో పెట్టినా, వారి చేత పని చేయించినా చట్టరీత్యా నేరం అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు భద్రత కల్పించాలి తప్ప, పిల్లలను పనికి పంపికూడదని తెలిపారు. బాల కార్మికులు ఎక్కడ, ఎవరికి కనిపించినా 1098,100,181 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బెంచ్ సభ్యులు పి.చిట్టిబాబు మాట్లాడుతూ బాలలకు జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు భారత రాజ్యాంగం కల్పించినప్పటికీ, ఈ బాలకార్మిక వ్యవస్థ ద్వారా బాలల హక్కుల ఉల్లంఘనలు జరుగుతుందని అన్నారు. కావున ప్రతి ఒక్కరు వారి భద్రతకు భరోసా కల్పించాలని భాధ్యత ప్రతి ఒక్కరిదీ అని తెలిపారు. పేదరికం వలన ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలను పెంచ లేని పరిస్థితుల్లో ఉంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారిని నేరుగా సంప్రదించాలని తెలిపారు. అటువoటివారికి విద్యా వసతి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం అధికారి సురగాల చిట్టిబాబు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బెంచ్ సిబ్బంది బి.సాయి కుమార్, డిస్ట్రిక్ ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కోఆర్డినేటర్ సివికి కాలిబాబు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కె వరలక్ష్మి, బవిరెడ్డి శంకర రావు తో పాటు వివిధ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ,తదితరులు పాల్గొన్నారు.