జగన్న కాలనీల్లో పూర్తిస్థాయి వసతులు..


Ens Balu
3
Visakhapatnam
2021-06-11 08:17:10

జగనన్న కాలనీలు సదుపాయాలకు నిలయం కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లాఠకర్ అన్నారు. ఆదేశించారు. 2022 మార్చి నాటికి మొదటి దశ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయుటకు కృషి చేయాలన్నారు. దసరా నాటికి సిద్ధం చేస్తే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. జిల్లాలో జగనన్న కాలనీలపై జిల్లా కలెక్టర్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ శాఖ వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై రెవెన్యూ జాయింట్ కలెక్టర్ తో సంప్రదించాలని ఆయన ఆదేశించారు. సమయం వృధా కాకుండా పనులు కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. సమస్యలు ఉంటే వాటిపై నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయన అన్నారు. కాలనీల్లో ప్రతి సౌకర్యం పూర్తి స్థాయిలో ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని లే అవుట్లలో విద్యుత్తు స్తంభాలు, ఇతర పరికరాల వివరాలు అంచనా వేయాలని ఇపిడిసీల్ ఎస్.ఇ ని ఆదేశించారు. లే అవుట్లలో సరఫరా చేసిన సామగ్రి వివరాలు ప్రతి రోజు జాయింట్ కలెక్టర్ కు సమర్పించాలని ఆయన అన్నారు.

లే అవుట్ లో మౌళిక సదుపాయాలు కల్పించలేదు అంటే కనీసం వంద నుండి రెండు వందల కుటుంబాలకు సౌకర్యాలు లేదని గ్రహించాలని ఆయన సూచించారు. అన్ని లే అవుట్లలో సౌకర్యాలు కల్పించుటకు డిపిఆర్ లు తయారు చేయాలని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న 24 లే అవుట్లలో అన్ని సౌకర్యాలు కల్పించుటకు తయారు చేసిన డిపిఆర్ ల కాపీలను గృహ నిర్మాణ జాయింట్ కలెక్టర్ కు ఆయన ఆదేశించారు. జియో టాగింగ్ అన్ని ప్లాటులకు పూర్తి కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. నిర్లక్ష్యం వహించేవారిని, పనులు సకాలంలో పూర్తి చేయని వారిని ఉపేక్షించేది లేదని కలెక్టర్ అన్నారు. లబ్దిదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సక్రమంగా జరగాలని చెప్పారు. పాలకొండ, పలాస లలో కొంత వరకు బాగా జరిగిందని ఇంకా మెరుగుపడాలని ఆయన పేర్కొన్నారు. లే అవుట్లలో మోడల్ గృహాలు నిర్మించాలని ఆయన ఆదేశించారు. శాఖలకు అవసరమైన సామగ్రి ఆయా శాఖలు సమకూర్చుకొని పనులు వేగవంతం కావడానికి శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు. లే అవుట్ల వారీగా అవసరమైన సిమెంట్, ఇనుము, ఇసుక తదితర సామగ్రి వివరాలు అంచనా వేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి లే అవుట్ వారిగా ఇసుక రేవులను మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు. టెక్కలి లే అవుట్ లో ఇసుక లేదని తెలిపారని దానిని పరిష్కరించాలని గనుల శాఖ డిడిని ఆదేశించారు. వివిధ పథకాల క్రింద నిర్మిస్తున్న ఇళ్ల పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. గృహ నిర్మాణ సంస్థ కార్యనిర్వాహక ఇంజినీర్లు, ఉపకార్యనిర్వాహక ఇంజినీర్లు పూర్తి బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

 

గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాలో 752 జగనన్న కాలనీల లే అవుట్లు ఉన్నాయని వాటిలో 729 లే అవుట్లలో చదును చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 663 లే అవుట్లు పూర్తి స్థాయిలో ఉన్నాయని చెప్పారు.  41,243 ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు.

ఆర్.డబ్ల్యు.ఎస్ ఎస్.ఇ వి.వి.ఈశ్వర రావు మాట్లాడుతూ 520 లే అవుట్లలో నీటి సౌకర్యం కల్పించుటకు

ఇపిడిసీల్ లో విద్యుత్తుకు రిజిస్ట్రేషన్ చేసామని, 55 లే అవుట్లకు ఇప్పటికే విద్యుత్తు సరఫరా జరిగిందని తెలిపారు.

ఇపిడిసీల్ ఎస్.ఇ ఎల్.మహేంద్రనాథ్ మాట్లాడుతూ లే అవుట్లలో అవసరమగు సౌకర్యాలను అంచనా వేస్తున్నామన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు,  గృహ నిర్మాణ సంస్థ ఇఇ పి.కూర్మి నాయుడు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కుర్మారావు, ఆర్.డబ్ల్యు.ఎస్ ఇఇ ఎస్.వీరభద్రరావు, పంచాయతీ రాజ్ ఎస్.ఇ జి.బ్రహ్మయ్య, భూగర్భ జలాలు, ఆడిటింగ్ శాఖ డిడి సి.సి.ఎస్ రావు, ప్రజారోగ్య శాఖ ఇఇ పి.సుగుణాకర రావు, డిపిఓ వి.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.