తిరుచానూరు అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎన్.వి.రమణ దంపతులు శుక్రవారం మధ్యాహ్నం తిరుచానూరు శ్రీ పద్మా వతి అమ్మవారి దర్శ నార్థం ఆలయ మహా ద్వారం వద్ద కు చేరు కున్న గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్.ఎన్.వి.రమణ దంపతులకు తిరు పతి,తిరుమల దేవ స్థానం ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి,గౌ. చంద్రగిరి శాసన సభ్యు లు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి జేఈఓ సదా భార్గవి, టిటిడి పాలక మండలి మాజీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి,టిటిడి ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరిబాయి,ఏఈఓప్రభాకర్ రెడ్డి లు పుష్ప గుచ్ఛా లతో స్వాగతం పలకగా వేద పండితులు పూర్ణ కుంభం తో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేదఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనా లతో తీర్థప్రసాదాలు అంద జేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వెంట ఏపీ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ కె. లలిత కుమారి,గౌ.జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర బాబు, తిరుపతి అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు,గౌ. ప్రోటోకాల్ మేజిస్ట్రేట్ పవన్ కుమార్ లతోతిరుపతి అర్బన్ అడిషనల్ ఎస్.పి సుప్రజ వీరి వెంట పాల్గొన్నారు.