తిరుమలలోని శ్రీవారు, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవార్లను దర్శించుకొని శుక్రవారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణమైన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి.రమణ వారికి రేణిగుంట విమానాశ్రయంలో సాదర వీడ్కోలు లభించింది.ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత కుమారి, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి రవీంద్ర బాబు, టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె. ఎస్. జవహర్ రెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి , గూడూరు ఎం. ఎల్.ఏ.వరప్రసాద్, జిల్లా కలెక్టర్ఎం .హరినారాయనన్
తిరుపతి అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు, ప్రోటో కాల్ మేజిస్ట్రేట్ పవన్ కుమార్, తిరుపతి అర్బన్ ఎస్.పి వెంకట అప్పల నాయుడు , ఆర్డీవో కనకనరసా రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎస్.సురేష్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ కమాండెంట్ శుక్లా, టర్మీనల్ మేనేజర్ గోపాల్, డి.ఎస్.పి.కాటమరాజు, తహసీల్దార్ శివప్రసాద్, సి.ఐ.అంజుయాదవ్, కోర్టు ఎంప్లాయస్ యూనియన్ లీడర్లు గోపీనాథ్ రెడ్డి, మస్తాన్ వలి, లక్ష్మీపతి, రవీంద్ర రెడ్డి తదితరులు వీడ్కోలు తెలిపిన వారిలో ఉన్నారు.