కోవిడ్–19 3వ వేవ్ కు అధికారులు, వైద్యాధికారులు సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరు ఈ విషయంపై వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టరు జిల్లాలో ప్రభుత్వ ప్రవేటు ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్, ఆక్సిజన్ స్టోరేజ్ పాయింట్లు, డ్రగ్స్ తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్థేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టరు అన్ని ఆసుపత్రులలో శతశాతం బెడ్స్ ను ఆక్సిజన్ బెడ్స్ క్రింద మార్చాలన్నారు. ఈ విషయమై జిల్లా వైద్యా ఆరోగ్యాశాఖాధికారి అన్ని నోటిఫైడ్ ఆసుపత్రులకు నోటీసులు జారీ గావించాలన్నారు. ప్రతీ ఆసుపత్రిని పరిశీలన గావించాలన్నారు. ఆసుపత్రులన్నింటిలో మెట్రిక్ టన్స్ ఆక్సిజన్ వినియోగించడం జరిగిందని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దీనికి గాను టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులలో బెడ్స్ కు ఎంత ఆక్సిజన్ సరఫరా అవసరమో అంచనా సిద్థం గావించాలన్నారు. ఆక్సిజన్ తయారు గావించే పి.ఎస్.ఎ. ప్లాంట్లను జిల్లాలో ఏర్పాటు గావించడానికి ప్రారిశ్రామిక వేత్తలతో చర్చించాలని పరిశ్రమల శాఖ జెనరల్ మేనేజర్ రామలింగరాజును ఆదేశించారు. ఆక్సిజన్ సిలెండర్స్ స్టాకు పాయింట్ ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. సి.హెచ్.సిలు అవసరమైన ఏర్పాట్లు గావించుకుని సమాయత్తం కావాలన్నారు. అందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్థం చేసుకోవాలన్నారు. ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన లాజిస్టిక్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్స్ ఎన్ని పెంచుకోవాలో ప్రణళిక సిద్థం గావించాలన్నారు. ఆ మేరకు అన్ని ఆసుపత్రులకు బెడ్స్ సంఖ్య పెంచడంపై సూచనలు జారీ గావించాలన్నారు. పెడియాట్రిక్ కోవిడ్ మేనేజ్మెంటు పై చర్చిస్తూ పిల్లలకు వైద్యసేవలు అందించడానికి గాను బెడ్స్ ఏర్పాటు, డ్రగ్స్ పెడియాట్రిక్ వెంటిలేటర్లు, అవసరమైన ఎక్విప్ మెంట్ సిద్థం చేసుకోవాలన్నారు. అదే విధంగా (PICU) పెడియాట్రిక్ ఇన్ టెన్సివ్ కేర్ యూనిట్లను ఏర్పాటు మరియు 0-5 మరియు 5-10 సంవత్సరాల పిల్లల కోసం ఆసుపత్రులలో పడకలు ఏర్పాటుపై చర్చించారు. సిఎస్ఆర్ బ్లాక్ లో అవసరమైన మార్పులు చేయించి సిద్దం కావాలన్నారు. అన్ని ఆసుపత్రుల వైద్యాధికారులతో ఈ విషయంపై సమావేశం నిర్వహించి తగు సూచనలు జారీచేసి సిద్దం గావించాలని జాయింట్ కలెక్టర్ 2 అరుణ్ బాబు ను ఆదేశించారు.
కోవిడ్ పరీక్షల నిర్వహణ
కోవిడ్19 పరీక్షల నిర్వహణలో ఎటువంటి అలసత్వం వలదని సూచించారు. ఇప్పటివరకు పరీక్షలు బాగా నిర్వహించారని, అదే కొనసాగించాలన్నారు.
ఈ సమావేశంలో ఎ.ఎం.సి. ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సూర్యనారాయణ, జి.యం.,డి.ఐ.సి. రామలింగరాజు, డ్రగ్స్ కంట్రోల్ అధికారిణి రజిత, డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.