సెంట్రల్ లైటింగ్ తో మరింత కాంతి..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-06-11 14:52:31

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని ప్రాంతాలను అభివ్రుద్ధి చేసి నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం రెండవవ జోన్ 6వ వార్డులోని దేవిమెట్ట జంక్షన్ నుండి అమరావతి జంక్షన్ వరకు సెంట్రల్ లైటింగు మంత్రితోపాటు నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే మన విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేస్తున్నారని, కొన్ని అవరోధాలు తొలగిన వెంటనే విశాఖపట్నం నుండి పరిపాలన సాగిస్తామని దీనితో మన నగరం ఎంతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కార్పొరేటర్ వార్డులో కొన్ని సమస్యలను ప్రస్తావించగా, వాటిని పరిష్కరిస్తామని కార్పొరేటర్ మంత్రివర్యులు హామీ ఇచ్చారు. కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక కృషితో రూ.39.45లక్షల వ్యయంతో ఈ సెంట్రల్ లైటింగును ఏర్పాటుచేశారన్నారు. అనంతరం నగర మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నగరాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని, జివిఎంసి నిధుల నుండి కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక కృషితో ఈ సెంట్రల్ లైటింగ్ ను రూ.39.45 లక్షల వ్యయంతో దేవిమెట్ట జంక్షన్ నుండి అమరావతి జంక్షన్ వరకు 41 పోల్సును ఏర్పాటుచేయడమైనదని, ఈ 41 పోల్సుకు 81ఎల్.ఇ.డి. బల్బులను ఏర్పాటుచేయడమైనదని తెలిపారు. వార్డులో సమస్యలపై పర్యటించాలని కార్పొరేటర్ కోరగా మేయర్ త్వరలో పర్యటిస్తానని, వార్డులో కావలసిన మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మేయర్ తెలిపారు. అనంతరం వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక మేయర్ కు శాలువా కప్పి అభినందించారు. ఈ పర్యటనలో వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక, పర్యవేక్షక ఇంజినీరు శ్యాంసన్ రాజు,  జోనల్ కమిషనర్ బి. రాము, కార్యనిర్వాహక ఇంజినీరు రాయల్ బాబు, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు లక్ష్మోజి, సహాయక ఇంజినీరు స్రవంతి తదితరులు పాల్గొన్నారు.