తొలిరోజే ఈ-ఆఫీస్ తో హెచ్చరిక..


Ens Balu
5
Anantapur
2021-06-11 15:23:05

ఈ-ఆఫీస్ ద్వారానే అధికారులందరూ జిల్లా కలెక్టర్ అనుమతి కోసం పంపే ఫైల్స్ అన్నింటినీ పంపాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సూచించారు. మాన్యువల్ గా పంపే ఫైళ్లను తాను ఆమోదించనని తెగేసి చెప్పారు. ఈ ఆఫీసులో పంపే ఫైళ్లను జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి సంబంధిత స్పష్టమైన రిమార్కులతో తన అనుమతి కోసం పంపాలంటూ అధికారులను హెచ్చిరించారు. తొలిరోజు విధుల్లోకి చేరుతూనే తన దైన మార్కును ప్రదర్శించారు జిల్లా కలెక్టర్.. అధికారులు పంపిన ఫైళ్లు ఏ దశలో ఉన్నాయో ఆ శాఖ  ఫాలోఅప్ చేయాలన్నారు. తన అనుమతి కోసం చివరి నిమిషాల్లో ఫైళ్లను తన వద్దకు పంపరాదన్నారు. అలాపంపే ఫైళ్ళను తాను ఆమోదించేది లేదని. క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన సందర్భాల్లో పంపే ఫైళ్లను అందుకు సంబంధించిన సస్పెన్షన్ ఆర్డర్ తో పాటు ఛార్జ్ మెమోలను కూడా రూపొందించి తన అనుమతి కోసం పంపాలన్నారు. తన దృష్టికి తీసుకురావాల్సిన అంశాలపై జిల్లా అధికారులు తనను మొబైల్ ద్వారా గాని,వాట్సాప్ ద్వారాకాని తెలియజేయవచ్చన్నారు. వివిధ శాఖలకు సంబంధించి ఆ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజెంటేషన్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఒక షెడ్యూల్ ను రూపొందించడం జరుగుతుందని,ఆ మేరకు ఆయా శాఖల చేపడుతున్న పథకాల అమలుతీరు తదితర అంశాలపైతానుసమీక్షించడం జరుగుతుందన్నారు.  ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.