విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకే ఏఈఓ రాఘవకుమార్ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. కరోనా తగ్గి జనజీవనం సాధారణ స్థితికి రావాలని స్వామిని వేడుకున్నట్టు ఎమ్మెల్యే వాసుపల్లి తెలియజేశారు. అనంతరం ఆలయ ఏఈఓ ఎమ్మెల్యే ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.