విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం మంత్రి జన్మదినోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకొని అంతరాలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కుటుంబానికి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని మంత్రి దర్శించుకుని, ఆపై కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. పూజలు నిర్వహించే వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఈఓ మంత్రికి ముత్తంశెట్టికి ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.