మంత్రిని కలిసిన అనంత జిల్లా కలెక్టర్ ..


Ens Balu
2
Anantapur
2021-06-12 16:30:15

అనంతపురం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నాగలక్ష్మీ సెల్వరాజన్  రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గ్రుహంలో మంత్రిని కలిసి పూలమొక్క బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న పలు అంశాలు మంత్రి జిల్లా కలెక్టర్ తో చర్చించారు. రాష్ట్రంలో అనంతపురం జిల్లాకి మంచి పేరుందని మీ రాకతో దానిని మరింతగా ఇనుమడింప చేయాలని మంత్రి కలెక్టర్ కు  సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని వర్గాల  ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని కలెక్టర్ మంత్రికి హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలందరికీ అందేలా చూస్తామని, అదేవిధంగా అభివ్రుద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తామని చెప్పారు.