టీకా వేయించుకొని అవగాహన కల్పించారు..
Ens Balu
3
శంఖవరం
2021-06-14 01:27:16
0-5ఏళ్ల లోపు పిల్లల తల్లులంతా అపోహలు వీడి కోవిడ్ టీకా వేయిచుకోవాలనే చైతన్యం తల్లులలో తీసుకురావడానికి శంఖవరం సచివాలయ మహిళా పోలీసు జిఎన్ఎస్ శిరీష(7నెలల బిడ్డకు తల్లి) టీకా వేయించుకొని మరీ పిల్లల తల్లులకు అవగాహన కల్పించారు. సోమవారం శంఖవరం కరోనా టీకా కేంద్రంలో పీహెచ్సీ వైద్యులు డా.ఆర్వీవిసత్యన్నారాయణ ఆధ్వర్యంలో మహిళా పోలీసు టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం సూచించిన విధంగా 5ఏళ్ల లోపు పిల్లల తల్లులంతా టీకా వేయించుకోవడం ద్వారా కరోనా వైరస్ భారిన పడకుండా రక్షణగా ఉండొచ్చునన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి ఇచ్చిన సూచనలు అన్ని అంగన్వాడీ కార్యకర్తల ద్వారా తల్లులకు తెలియజేశామని అన్నారు. కొందరిలో ఉన్న అపోహలు పొగొట్టడానికి 7నెలల బిడ్డకు తల్లిగా వున్న తాను టీకా వేయించుకున్నానన్నారు. టీకా వేసిన తరువాత జర్వం, శరీరం నొప్పులు వచ్చినా వాటికి ముందుగానే టీకా వేసే సమయంలోనే వైద్య సిబ్బంది మందులు కూడా అందజేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా చిన్నపిల్లల తల్లులంతా కోవిడ్ టీకా వేయించుకోవాలని మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష పిలుపునిచ్చారు. అదేవిధంగా 45సంవత్సరాలు దాటిన వారు కూడా ప్రభుత్వం అందించే ఈ ఉచిత టీకాను వేయించుకొని రక్షణ పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.