గృహ నిర్మాణం పై మంత్రుల సమీక్ష..
Ens Balu
2
Vizianagaram
2021-06-14 01:32:46
విజయనగరం జిల్లా లో పెద్ద ఎత్తున చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమాలపై సమీక్షించేందుకు రాష్ట్ర మంత్రులు ఈనెల 15న జిల్లాకు వస్తున్నారు. ఆరోజు ఉదయం 10-30 గంటలకు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో జరిగే సమీక్షా సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు పాల్గొంటారని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. గృహ నిర్మాణం లో వున్న క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకొని వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం,వాటికి పరిష్కారం చూపడం ద్వారా జిల్లా గృహనిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసే దిశగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.