ప్రతీఒక్కరూ ముందుకు రావాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ కెఆర్‌డి ప్రసాదరావు కోరారు. ఆరోగ్యవంతులైన వారు ప్రతీ మూడు నెలలకూ ఒకసారి రక్తదానం చేయవచ్చునని సూచించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా స్థానిక రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకులో సోమవారం రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఛైర్మన్ ప్రసాద్ మాట్లాడుతూ, రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. రక్తదానంపై అపోహలను విడనాడాలని, ఆరోగ్యవంతులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, రక్త దాతలుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, రక్తదాతలను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త ఎం.రామ్మోహన్, మేనేజింగ్ కమిటీ సభ్యులు పి.రామకృష్ణారావు, రెడ్డి రమణ, జిల్లా బాలల హక్కుల కమిటీ మాజీ ఛైర్మన్ కేసలి అప్పారావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు మువ్వల గంగాప్రసాద్ తదితర లైఫ్ మెంబర్లు, రెడ్‌క్రాస్ వైద్యులు డాక్టర్ బి.కామేశ్వర్రావు, ఏపిఆర్ఓ ఎం.రాము, ఫీల్డ్ ఆఫీసర్ డి.గౌరీశంకర్, ఎన్.చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
రక్తదానం చేసిన సమాచారశాఖ ఎడి రమేష్
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, జిల్లా సమాచార, పౌర సంబంధాలశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దున్న రమేష్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో సోమవారం రక్తాన్ని ఇచ్చారు. రమేష్‌ను రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ కెఆర్‌డి ప్రసాదరావు అభినందించి, జ్ఞాపికను అందజేశారు. జిల్లా అధికారులు, ఉద్యోగులు రమేష్ బాటలో నడిచి, రక్తదానానికి ముందుకు రావాలని ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.