కోవిడ్ రెండోదశలో రోగులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా ఓలమ్ ఆగ్రో ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ జిల్లాకు పది ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చింది. ఈ మేరకు సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో సంస్థ ప్రతినిధులు కాకినాడ అర్బన్ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డికి దాదాపు రూ.13 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు. కోవిడ్ వైరస్ తీవ్రత అధికంగా ఉన్న బాధితులకు ప్రాణవాయువును అందించేందుకు ఉపయోగపడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించిన ఓలమ్ ఆగ్రో ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు కలెక్టర్, శాసనసభ్యులు అభినందనలు తెలియజేశారు. జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. కాకినాడ పోర్టు శ్రామికులకు మల్టీ విటమిన్ టాబ్లెట్లు, శానిటైజర్లు, మాస్కులు వంటివి కూడా అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఓలమ్ సంస్థ మేనేజర్ ఛార్లెస్, కస్టమ్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.సత్యనారాయణ, షిప్పింగ్ ఇన్‌ఛార్జ్ వెంకటేశ్, శ్రీనివాస్‌రెడ్డి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.