ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారు నీతి నిజాయితీలతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవా లని జిల్లా కలెక్టర్డా.ఎం .హరిజవహర్ లాల్ హితవు పలికారు. జిల్లాలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల స్థానంలో వారి వారసులు, కుటుంబ సభ్యులకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తూ ఐదుగురికి కలెక్టర్ సోమవారం నియామక పత్రాలను అందజేశారు. వీరిలో పెదకాపు అశోక్(సహకార), మూలమండ్ల శైలజ(భూగర్భ జలాలు), సబ్బవరపు ప్రదీప్ చంద్ర(రెవిన్యూ), నిమ్మక సంతోష్ కుమార్(ఖజానా శాఖ) లను జూనియర్ అసిస్టెంట్‌లుగా, కొండగొర్రి వంశీకి వ్యవసాయ శాఖలో కార్యాలయ సహాయకునిగా అవకాశం కల్పిస్తూ కలెక్టర్ నియామకాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువ ఉద్యోగులు కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవరచుకోవాలని కోరారు. తమకు లభించిన ఈ అవకాశాన్ని ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, కలెక్టరేట్ ఏ.ఓ. దేవప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.