రుయా సీమకే తలమానికం కావాలి..


Ens Balu
3
Tirupati
2021-06-14 11:24:57

 వైద్యసేవలపై విమర్శలువద్దు, అకారణంగా వైద్య వృత్తి వారిపై నిందలు మోపితే దేవుడిపై నిందలు మోపినట్లేనని స్థానిక శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం తిరుపతి రుయా ఆసుపత్రిలోని కోవిడ్ బారిన పడినటువంటి వారి పరిస్థితులను స్వయంగా వార్డులలో పర్యటించి  
ఆప్యాయతతో  పలకరిస్తూ,  భుజం తట్టి నేనున్నానని మనో   ధైర్యాన్ని , భయపడ వద్దని భరోసా ఇస్తూ రోగుల తరఫు బంధువులకు అభివాదం చేస్తూ  తాను అండగా ఉంటానని హామీనిచ్చారు.  రాష్ట్ర  ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందన్నదని, తిరుపతి రుయా కోవిడ్ సెంటర్  చికిత్స పొందుతున్న వారి  ఆరోగ్యస్థి, బాగోగులు వంటివి  వైద్యులును కూడా ఆరా తీస్తూ  వారికి మరింత  మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కోవిడ్ ఆసుపత్రిలో పర్యటన అనంతరం మీడియాకు వివరిస్తూ..కరోనా గత కొద్దిరోజులుగా తగ్గు ముఖం పట్టడం శుభ సూచికమని, పేదల ఆసుపత్రిగా  రుయా  చేరిన కొవిడ్ బారిన పడినటువంటివారిని ఎంతోమందిని  బ్రతికించిందని అన్నారు.  రుయాలో రుయా ఆసుపత్రిలో వైద్యులు అందిస్తున్న సేవలు శ్లాఘనీయమని, వైద్యసేవలతో పాటు వారి మానసిక స్థితి, అభిప్రాయాలు తెలుసుకుని మనోధైర్యాన్ని అందిస్తున్నారని తెలిపారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులతో పోల్చుకుంటే రుయా ఆసుపత్రి నుండి కరోనా నుండి ఆరోగ్యంగా వెళ్ళిన వారే ఎక్కువగా వున్నారని అన్నారు.  మన కళ్ళ ముందే మన ఆత్మీయులు మరణిస్తే ఆసుపత్రి నిర్లక్ష్యం అనడం తప్పని,  వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి  ప్రమాదం సంభవిస్తే  వారి బంధువులు, అటెండర్లు సంబంధిత  వారికి  ధైర్యం ఇవ్వాలే తప్ప, అకారణంగా వైద్యుల పై ఆరోపణల చేయడం వల్ల వైద్యుల మనో ధైర్యాన్ని దెబ్బ తీసినట్లు అవుతుందన్నారు. రుయాలో అందిస్తున్న వైద్యసేవలకు సూపరింటెండెంట్ డా. భారతి వారి బృందాన్ని ఆబినందిస్తున్నానని అన్నారు. రుయాలో హోమ్ గార్డుల జీతాల ఆలస్యం విషయంలో జిల్లా కలెక్టర్ ప్రభుత్వంతో మాట్లాడి చేస్తున్నారని , నేను కూడా  కోవిడ్ సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రికి సూచించమని త్వరలో అందుతాయని అన్నారు. కలెక్టర్  ఉద్యోగులకు, వైద్యసిబ్బందికి  పని ఒత్తిడి పెంచుతున్నారనే అనడం సరికాదని వారు చక్కగా పనిచేస్తున్నారని అన్నారు.