అనంతపురం జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అందించా లని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం పై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతును వైయస్సార్ ఉచిత బీమా పథకం లో చేర్పించాలని, ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవా లన్నారు. అధిక వర్షాల వల్ల పంట నష్టం జరిగితే వారికీ నష్ట పరిహారం వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పంట కోతలో తక్కువ దిగుబడి నమోదు అయినప్పుడు వాటికి కూడా నష్ట పరిహారం వచ్చే విధంగా చూడాలన్నారు. జిల్లాలో వరి పంట సాగును తగ్గించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని అగ్రి అడ్వైసర్ బోర్డు సభ్యులుకు సూచించారు. వ్యవసాయ శాఖ మరియు సిపిఓ పంటల బీమాలో అన్ని జాగ్రత్తలు ఇప్పటి నుంచే తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2020 కి సంబంధించి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ శాఖ ద్వారా పంటల బీమా నమోదు మొదులుకొని పంపణీ వరకు వ్యవసాయ శాఖనే నిర్వహించడం జరిగిందని, ఇంకా మెరుగ్గా ఈ పథకం అమలు పరచడానికి జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించి సలహాలు మరియు సూచనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ కమీషనర్ కోరడమైనదని, అందులో భాగంగా మన జిల్లాలో ఇప్పటి వరకు పంట బీమా క్రింద నమోదు కాని ఆముదం, పెసలు, అలసందలు, ఉలవలు, ఉద్యానవన పంటలు బొప్పాయి, టమోటాను నమోదు చెయ్యవలసిందిగా కమిటీ సభ్యులు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రి అడ్వైసరీ బోర్డు చైర్మన్ T. రాజశేఖర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి వై.రామక్రిష్ణ, సిపిఓ ప్రేమచంద్ర, ఎల్డిఎం మోహన్ మురళి, ప్రోగ్రాం కోర్డినేటర్ డా.జూన్స్, కెవికె రెడ్డిపల్లి ప్రధాన శాస్త్రవేత్త సహదేవ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ ఈ, సహాయ వ్యవసాయ సంచాలకులు (రెగ్యులర్) మరియు ఇతర మండల అగ్రి అడ్వైసరీ బోర్డు చైర్మన్ లు, రైతులు పాల్గొన్నారు.