కరోనా మహమ్మారి కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడమే కాకుండా బంధుత్వాలు కూడా దూరమౌతున్న పరిస్థితుల్లో కరోనా బాధితులను ఆదుకొనేందుకు తామున్నామని ముందుకు వచ్చి కాకినాడ ఖిద్మత్ కమిటి ( కాకినాడ సేవా కమిటి ) చేస్తున్న సేవలను నగర పాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సేవలను కమీషనర్ స్వప్నిల్ దినాకర్ లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం మద్యాహ్నం కాకినాడ కార్పోరేషన్ కార్యాలయ ఆవరణలో కాకినాడ ఖిద్మత్ కమిటి ( కాకినాడ సేవా కమిటి ) నూతనంగా ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సేవల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది . కమిటీ సభ్యులు హస్సేన్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా నగర పాలక సంస్థకమీషనర్ పాల్గొని కమిటీ ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సేవలను జెండా ఊపి ప్రారంభించారు . కాకినాడ ఖిద్మత్ కమిటి కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు చేస్తున్న సేవలను కమిటి సభ్యులు కమీషనరుకు తెలియజేసారు.ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ కాకినాడ నగర ప్రజలకు ఖిద్మత్ కమిటి చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ అంబులెన్స్ సేవలను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కమిటి సభ్యులు హస్సేన్ షరీఫ్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి వారికి అవసరమైన సేవాలందించాలనే ఉద్దేశ్యంతో కాకినాడ ఖిద్మత్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగిందన్నారు. ప్రధానంగా అంబులెన్స్ ఉచిత సేవల ఏర్పాటుకు దాతల అందించిన సహకారం మరువలేనిదన్నారు.
'మా ', 'మేవా ' సంస్థలు అంబులెన్స్ కొనుగోలుకు సగభాగం నిధులను అందించి ప్రోత్సహించగా, దాతలు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి విరాళలను అందించారన్నారు. ఈ సత్కార్యానికి సహకరించిన దాతలందరికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నేటి నుండి అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అంతేకాకుండా నీరు పేదలకు సహాయం అందించడం , రక్తదాన శిబిరాలను నిర్వహించడం , పేద విద్యార్థులను ప్రోత్సహించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించడం వంటి కార్యక్రమలను కూడా చేపట్టనున్నట్లు హస్సేన్ షరీఫ్ వివరించారు . ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ నాగనరసింహరావు , హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృధ్వీ చరణ్ , రెడ్ క్రాస్ జిల్లా విభాగం చైర్మన్ వై.దశరథ రామారావు , కమిటి సభ్యులు ముజాహిద్ , అజార్ , అజు , అలీం , గౌస్ , ఎండి నోమ్ , ఖాలీషా , ఆసిఫ్.ఈతిషామ్ , బాషా , సయ్యద్ హుస్సేన్ , షరీస్, కమల్ , మసూద్ .. సీనియర్ పాత్రికేయులు చిష్టి , చేయూత అధ్యక్షులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.