లిట్టర్ బిన్స్ శుభ్రంగా ఉంచాలి..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-06-14 16:00:12

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో లిట్టర్ బిన్స్ ను పరిశుభ్రంగా ఉండాలని జివిఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జివిఎంసీ పరిధిలోని 2వ జోన్ 12వ వార్డు పరిధిలోని ఆరిలోవలో కనక మహాలక్ష్మి కోలనీ, రవీంద్రనగర్, విశాలాక్షి నగర్, మరియు 3వ జోన్ లోని ఎంవిపి కోలనీ, టిటిడి కళ్యాణ మండపం, ఉషోదయ జంక్షన్, పెదవాల్తేరు తదితర ప్రాంతాలలోనూ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి జోన్ లోనూ లిట్టర్ బిన్స్ చుట్టుపక్కల చెత్త ఉంచకూడదని, లిట్టర్ బిన్స్ ను శుభ్రంగా ఉంచాలని, వాటి చుట్టూ బ్లీచింగ్ చల్లాలని  శానిటరి అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో దృష్టిలో పెట్టుకొని  మ్యాన్ హోల్సు  పొంగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ బి. రాము, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చిరంజీవి, శంకర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వంశి, అసిస్టెంట్ ఇంజనీర్ సత్యనారాయణ, శానిటరి  సూపర్వైజర్లు, శానిటరి ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.