రాష్ట్రంలోని మోడల్ వార్డులలో పారిశుధ్య పనులపై దృష్టి పెట్టాలని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంఎ & యుడి ప్రత్యేక కార్యదర్శి వై. శ్రీలక్ష్మి మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. సోమవారం అమరావతి నుంచి నిర్విహించిన వీడియో కాన్ఫరెన్సులో జివిఎంసి నుంచి కమిషనర్ డా. జి. సృజన, అదనపు కమిషనర్ డా.వి.సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్లాప్ (CLAP) పధకంలో భాగంగా పారిశుధ్య పనులు మరింత సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో కొన్ని మోడల్ వార్డులుగా ఎంపిక చేసి, ఆ వార్డులలో ఉన్న గృహాలకు చెత్త డబ్బాలు ఇచ్చి తడి–పొడి చెత్తను వేరు చేసి ఇచ్చే విధంగా, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నగరంలో చెత్త బిన్లను లేకుండా చేయాలని, చెత్త తరలించే వాహనాలను జి.పి.ఎస్. తో లింక్ చేసి రూట్ మ్యాప్ ను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంఎ & యుడి ప్రత్యేక కార్యదర్శి వై. శ్రీలక్ష్మి క్లాప్(CLAP) పధకంలో భాగంగా మోడల్ వార్డులలో పారిశుధ్య పనుల పరిస్థితులపై ఆరా తెసారు. అక్కడ మలేరియా, డెంగ్యూ మొదలగునవి విజృంభించకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఐ.ఇ.సి. యాక్టివిటీస్, పారిశుధ్య పనులు, వార్డులో తడి-పొడి మరియు ప్రమాధకరమైన చెత్తను వేరుచేసే విధానాలపై ఆరా తీశారు. జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన మాట్లాడుతూ 572 సచివాలయాల నుండి డోర్ టు డోర్ చెత్తను సేకరించడం జరుగుతుందని, వాహానాలు వెళ్ళలేని ప్రాంతాలకు పుష్ కార్టుల ద్వారా చెత్తను సేకరిస్తున్నామని, మోడల్ వార్డులో డంపర్ బిన్స్ లేకుండా వాహనమూల ద్వారా చెత్తను సేకరిస్తున్నామని, ఏ పనికి కేటాయించిన వారిని ఆ పనికే ఉపయోగిస్తున్నామని, పారిశుధ్య పనులపై నివాస సంక్షేమ సంఘాలు, మహిళా సంఘాల ద్వారా అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
చెత్త తరలించే ప్రతి వాహనానికి రూట్ మ్యాపును తయారు చేయండి:
అనంతరం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెత్త తరలించే ప్రతి వాహనానికి రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అన్నారు. ప్రతి జోన్ లోనూ చెత్త తరలించే వాహనాలను పార్క్ చేయుటకు ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి ఆ ప్రదేశం చుట్టూ బౌండరీ ఏర్పాటు చేసి ప్రతి వాహనము అక్కడే పార్కు చేయాలని సూచించారు. ప్రతి రెండు జోన్ లకు ఒక వాహన రిపేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. తడి-పొడిగా సేకరించిన చెత్తను కలపకుండా, డంపింగ్ యార్డ్ లో వేరు వేరుగా ఉంచాలని ఆదేశించారు. ప్రతి వాహనము ఎన్నిసార్లు డంపింగ్ యార్డ్ కు చెత్తను తరలిస్తున్నదో పక్కా రికార్డు ఉండాలని ఆదేశించారు. వాహనాలు సమృద్ధిగా ఉన్న ప్రదేశాలలో లిట్టర్ బిన్స్ పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఏ పనికి కేటాయించిన వారిని మరియు వాహనాలను ఆ పనికే ఉపయోగించాలన్నారు. ప్రతి పారిశుద్ధ కార్మికులకి యాప్రాన్ బ్లౌజులు, గ్లౌజులు, కాలవలో పనిచేసే కార్మికులకు బూట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. ప్రతి లిట్టర్ బిన్స్ చుట్టూ బొంతలు, తలగడలు దర్శనమిస్తున్నాయని, వీటి కొరకు సచివాలయాల పరిధిలో వారంలో ఒక రోజు స్పెషల్ డ్రైవ్ ద్వారా, వాటిని సేకరించాలన్నారు. నగరంలో పందుల సంచారం ఎక్కువగా ఉందని వాటిని నిర్మూలించాలని ప్రధాన వైద్యాధికారిని ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కమిషనర్ డాక్టర్ బి సన్యాసిరావు ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి, ఏఎంఒహెచ్ రమణ మూర్తి పాల్గొన్నారు.