మహావిశాఖ వైపే ఆ.. ఐఏఎస్ ల చూపు..


Ens Balu
4
Visakhapatnam
2021-06-15 01:47:56

విశాఖ ఈ పేరు వినగానే అందమైన నగరం గుర్తొస్తుంది..ఇది ఒకప్పటి వరకూ ఇపుడైతే అంతే అందమైన నగరం కాబోయే పరిపాలనా రాజధాని  కాబోతుండటం, రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కార్పోరేషన్, రెండో అతి పెద్ద జిల్లా కూడా కావడంతో అందరి ఐఏఎస్ ల చూపు ఇపుడు విశాఖ వైపే పడిండి..ఇక్కడ ఏదో ఒక పోస్టులోకి వస్తే ఎంత కాదనుకున్నా ఓ ఐదారేళ్లు అలా అలా గడిపేయవచ్చుననేది ఒక బావన అంతేకాదు.. కొందరు ఐఏఎస్ లు ఇపుడు విశాఖను పట్టుకొని వదలక పోవడం, ప్రభుత్వ పెద్దలను ప్రశన్నం చేసుకొని ఇక్కడే తిష్టవేసుకొని కూర్చోవడంతో ఓ నలుగురు ఐఏఎస్ ల చూపు ఇపుడు విశాఖవైపునకు తిరిగింది.. అందులో ఇద్దరు ఐఏఎస్ లకు స్థానిక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకొని లైన్ క్లియర్ చేసుకున్నట్టుగా చెబుతున్నారు.. కీలక స్థానంలో రెండేళ్లుకు పైగా అధికారులు పనిచేశారో ఆ ప్రదేశాలకు రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారట..  ఇదే క్రమంలో ప్రజాప్రతినిధులకు ఎవరైతే సహకారం అందించడం లేదో..ఆ స్థానాల్లోకి వచ్చి తమ కోరికతోపాటు ప్రజాప్రతినిధులకు తన మనిషిని అనే భావన కల్పించి ఇక్కడే ఉండిపోతే..రేపు పరిపాలనా రాజధాని ఏర్పడిన తరువాత కూడా ఇక్కడే మరో పదేళ్లు ఉండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో ఐఏఎస్ లకు రెండు మూడేళ్లు దాటినా స్థాన చలనం రావడం లేదు..పరిపాలనా పరమైన సౌలభ్యం కోసం ఒక్కొ ఐఏఎస్ అధికారిని జిఏడికి రిపోర్టు చేయాలని ఆదేశించినా చక చకా పావులు కదిపి మరీ విశాఖ వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖలోని ఐఏఎస్ అధికారి పనిచేసే స్థానానికి డిమాండ్ పెరిగింది. అదే సమయంలో తమకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో అలాంటి అధికారులను విశాఖ రప్పించుకోవాలని కూడా ప్రజాప్రతినిధులు చూస్తున్నారట. ఇప్పటికే ఆ దిశగా ఐఏఎస్ అధికారులు మంతనాలు కూడా సాగిస్తున్నారని సమాచారం. కాగా ఇప్పటికే ఒక దఫా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. మరోసారి ఐఏఎస్ లబదిలీలు జరిగినపుడు విశాఖకు తమను తీసుకు రావాల్సిందిగా సదరు అధికారులు ప్రజాప్రతినిధులను కోరినట్టు ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో తమను విశాఖనుంచి కదపొద్దని ఇక్కడ పనిచేస్తున్న ఐఏఎస్ లు కూడా మంత్రులను కలిసి మరీ వేడుకున్నారట. కొందరు ప్రజాప్రతినిధుల మాటకు విలువ ఇవ్వని వారిని బదిలీ చేయించి.. తమ మాటలకు విలువ ఇచ్చే అధికారులను విశాఖ తీసుకు రావడానికి ఒక మార్గం సుగమం అయ్యిందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంలోని కీలక నేతలను పట్టుకొని తమ ప్రయత్నాలకు పదును ఆ నలుగురు ఐఏఎస్ లు పదును పెడుతున్నట్టు తెలుస్తుంది..విశాఖలోని మంత్రుల సిఫార్సులు పట్టించుకోని ఐఏఎస్ లు ఇక్కడ ఉంటారా..లేదంటే విశాఖ రావడానికి ఆశక్తి చూపుతున్న ఆ ఐఏఎస్ లను ప్రజాప్రతినిధులు ఈ జిల్లాకి తెచ్చుకుంటారా అనేది ఆశక్తి కరంగా మారింది.. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి..!