గీతం యూనివర్శిటీ కుటుంబ సభ్యుడుని కోల్పోయింది..


Ens Balu
3
గీతం యూనివర్శిటీ
2020-08-31 19:38:35

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ  మరణం పట్ల గీతం డీమ్డ్ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయ న ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతున్నట్టు ప్రకటించారు. గత ఏడాది ఆగష్టు నెలలో జరిగిన గీతం 39వ వ్యవస్ధాపక దినోత్సవంలో   ప్రణభ్ ముఖర్జీకి  గీతం ఫౌండే షన్ అవార్డును అందజేసిన  స్మృుతులు ఇంకా మరచిపోలేదన్న ఆయన గీతం వేదికగా ఉన్నత విద్యారంగానికి  పలు సూచనలు  చేశారని వైస్ ఛాన్సలర్ గుర్తు చేసు కున్నారు.  గీతం అవార్డును స్వీకరించడం ద్వారా  ప్రణభ్ ముఖర్జీ ని గీతం  కుటుంబంలో   సభ్యుడిగా  భావించామని పేర్కొన్నారు.  గీతం ఆవిధంగా  గొప్ప ఆప్తుడిని  కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయం తరపున  ఆయన  కుటుంబానికి  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.     
సిఫార్సు