కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు అవసరమైన రూ.18 లక్షల విలువైన 12 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించిన తమ సేవను చాటుకుందని జెసీ కీర్తి చేకూరి అన్నారు. ఈ మేరకు సంస్థ సిఎం కె.శ్రీధర్, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావులతో కలిసి ఆక్సిజన్ మిషన్లను జెసికి అందజేశారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ, కరోనా సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అవసరం ఎంతో వుంటుందని, అలాంటి అత్యవసర మిషన్లు అందించిన సంస్థ సభ్యులను ఈ సందర్భంగా జెసి అభినందించారు. ఇదే స్పూర్తితో మరింత మంది దాతలు ముందుకి వచ్చి కరోనా రోగులకు అందించే సేవకు తోడ్పాటు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్, సర్వారాయ సుగర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.