ఘనంగా మిధున సంక్రమణం..
Ens Balu
3
Simhachalam
2021-06-15 14:43:16
విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం మిధున సంక్రమణం వైభవం నిర్వహించారు. మహా పర్వదినం, వడాయితీ సంప్రోక్షణ, స్థలశుద్ధి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం మధ్యాహ్నం 3:30కు ఆస్థాన మండపంలోని గోవిందరాజస్వామి ,శ్రీదేవి, భూదేవి ఆళ్వారులకు ఆరాదణ కార్యక్రమం నిర్వహించి సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహించి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారి తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. మిధున సంక్రమణం రోజున తిరువీధిలో స్వామిని దర్శించుకుంటే సకల పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మిక..