ఆక్సిజన్ సిలెండర్ల వితరణ హర్షదాయకం..


Ens Balu
2
Anantapur
2021-06-15 14:44:09

కరోనా కష్టకాలంలో 40 ఆక్సిజన్ సిలిండర్ లను అందజేయడం ఎంత గొప్ప విషయమని, నగరంలోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)ఏ.సిరి పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం నగరంలోని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నేపథ్యంలో ఆలూరు ఫౌండేషన్ తరఫున హైదరాబాద్ నుంచి తెప్పించిన ఒక్కోటి 45 వేల రూపాయల విలువ చేసే 40 ఆక్సిజన్ సిలిండర్ లను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)కి శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ నగరంలోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేయాలని, కరోనా పేషంట్లకు ఆక్సిజన్ అందించేందుకు సిలిండర్లను ఉపయోగించాలని సూచించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావును ఆదేశించారు. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లను అందజేయడం పట్ల ఎమ్మెల్యేకి అభినందనలు తెలిపారు.