గంగమ్మ తల్లికి వాసుపల్లి పూజలు..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-06-15 14:56:33

గంగపుత్రులు కడుపునింపేలా మత్స్యసంపద దొరికేలా దీవించాలంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజలు చేశారు. చేపల వేట విరామం అనంతరం గంగమ్మతల్లికి పూజలు చేసిన తరువాత మత్స్యకారులు మళ్లీ చేపల వేటను ప్రారంభింస్తారు. ఈ సందర్భంగా మంగళవారం ఫిషింగ్ హార్బర్ లోని గంగమ్మతల్లి ఆలయంలో నిర్వహించిన పండుగ కార్యక్రమంలో పాల్గొని తల్లికి పూజలు చేశారు. అనంతరం జాలర్లకు శుభాకాంక్షలు తెలియజేసి, మత్స్యసంపదలో అభివ్రుద్ధి చెందాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్ కేసులు ఉద్రుతంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు, నిబంధనలు కూడా పాటించాలని మత్స్యకారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాటు 37వార్డ్ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, ఫిషింగ్ బోట్ అసోసియేషన్ సభ్యులు పి.సి అప్పారావు, నర్సింగ్, బుజ్జి, కొండబాబు, ఎల్లాజి, అమ్మోరు, రామరాజు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.