పైడితల్లమ్మ తల్లీ కరుణించమ్మా..
Ens Balu
4
Simhachalam
2021-06-15 15:05:16
శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి సోదరి, ఏడు గ్రామాల ప్రజల ఆరాధ్యదేవత శ్రీ పైడితల్లమ్మ వారి వార్షిక పండగ ఘనంగా నిర్వహించారు. అమ్మవారి సదకంపట్టు వద్ద పూజార్ల వంశీయులు లండ వెంకటరమణ, చిన్న వెంకట రమణలు అమ్మవారికి సంప్రదాయ పూజలు చేసి మంగళ హారతులిచ్చారు. కరోనా నేపథ్యంలో దేవస్థానం పిలుపు మేరకు భక్తులంతా ఇళ్ల వద్దనే అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, రవికలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు దేవాలయానికి వచ్చారు. తలుపులు వేసి ఉండడంతో అమ్మవారిని బయటనుంచి కూడా దర్శించుకునే భాగ్యం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు దేవస్థానం అధికారులతో చర్చించడంతో లోపల తలుపులు తెరిచి ప్రాంగణం గేట్లకు తాళాలు వేశారు. దీంతో భక్తులంతా ఆరుబయట నుండి అమ్మవారిని దర్శించుకున్నారు. గేట్ల వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానం ఏ ఈవోలు తిరుమలేశ్వరరావు, ఆనందకుమార్ , ఇజ్జురోతు శ్రీనివాసరావు, సూపరెంటెండెంట్ పర్యవేక్షణలో ఉద్యోగులు దేవాలయం వద్ద ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయం వద్ద దేవస్థానం ఆంక్షల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు గాంధీనగర్ వద్ద ఉన్న అమ్మవారి సదకంపట్టు వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక కార్పొరేటర్ పిసిని వరహానరసింహం, అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వనితులు ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, మాజీ సర్పంచ్ పాశర్ల ప్రసాద్, వైసీపీ నాయకులు కొలుసు ఈశ్వరరావు, కర్రి సత్తి బాబు, గంట్ల కిరణ్ బాబు, దొంతల సంతోష్ . ఆకుల నాగరాజు. కొలుసు శ్రీను. బంటు బిల్లి త్రినాధ్.. తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.