అనంత చీకట్లోనే మగ్గిపోవాలా..


Ens Balu
3
అనంత సిటీ
2021-06-15 15:09:51

అనంతపురం నగరంలో వీధి దీపాలు నిర్వహణ కూడా సరిగా లేకుంటే ఎలా అంటూ మేయర్ వసీం అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలోని  ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ లలో వీధి దీపాలు నిర్వహణను మంగళవారం రాత్రి మేయర్  ఆకస్మికంగా పరిశీలించారు. పలు చోట్ల వీధి దీపాలు వెలగక పోవడంతో సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాన వీధులలోనే లైట్లు వెలగక పోయినా పట్టించుకోని మీరు ఇక చిన్న విధులలో ఎంత మాత్రం పర్యవేక్షణ చేస్తున్నారో అర్ధమవుతుందంటూ మండిపడ్డారు. రాజు రోడ్ లో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన లైట్లు కూడా వెలగక పోయినా నిర్వహణ ఎంతమాత్రం చేస్తున్నారో మీ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై లైట్ల నిర్వహణపై రిజిస్టర్ తప్పని సరిగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు బాలాంజినేయులు,కమల్ భూషణ్,అనీల్ కుమార్ రెడ్డి, డి ఈ  బాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.