సింహాచలంలో ఆ నియామకాలేమవుతాయ్..


Ens Balu
5
Simhachalam
2021-06-16 02:46:15

మన్సాస్ తో పాటు సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్టును హైకోర్టు రద్దు చేసిన తరువాత కొత్తగా మరో కొత్త చిక్కు వచ్చిపడింది. ట్రస్టుబోర్డు ఏర్పాటు అయిన తరువాత ఆ హోదాతో ట్రస్టు చైర్మన్, అధికారులు కలిపి ఎక్కడా లేనివిధంగా దేవస్థానంలో కొన్ని నియామకాలు చేపట్టారు. దీనితో ఇపుడు అందరి మదినీ ఆ అనుమానం తొలిచేస్తుంది. కోర్టు ఉత్తర్వులు రద్దు అయినపుడు బోర్డు అనుమతితో చేపట్టిన నియామకాలను కూడా ప్రభుత్వం రద్దు చేయాల్సి వుంటుందని చెబుతున్నారు.. కానీ అలా జరగలేదు..కేవలం ట్రస్టుబోర్డు మాత్రమే రద్దైంది..దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుందనే ధీమాతో ట్రస్టు బోర్డు చేపట్టిన నియామకాల జోలికి మాత్రం ఎవరూ వెళ్లలేదు. కనీసం అర్హత లేకుండా అడ్డగోలుగా నియామకాలు చేపట్టారనే వాదన కూడా బలంగా వినిస్తుంది. ఇపుడు ఆ కోర్టు ఉత్తర్వులు ట్రస్టుబోర్డు రద్దుతోపాటు, వాటిపై కూడా జరుగుతాయనే అనేది హాట్ టాపిక్ గా మారింది. అధికారులు మాత్రం ఆ నియామకాలన్నీ ప్రభుత్వం చేపట్టందని చెబుతున్నా..ట్రస్టుబోర్డు చైర్మన్ అనుమతి, బోర్డు తీర్మాణంతోనే వాటిని చేపట్టారని సమాచారం అందుతుంది. హైకోర్టు తీర్పుపై ట్రస్టుబోర్డు రద్దు అయిన నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీం కోర్టు వెళ్లి కేసు గెలిచేవరకూ ట్రస్టుబోర్డు అనుమతితో చేపట్టిన నియాకాలన్నీ గాల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేలా వుంది. అయితే ఈ విషయమై ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ, కోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం ట్రస్టు చేపట్టిన నియామకాలన్నింటినీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకూ అలా హోల్డ్ లో పెడతాయా..లేదంటే కొనసాగిస్తాయా అనేది తేలాల్సి వుంది..