మాన్సాస్ మరో మలుపు తిరుగుతుందా..
Ens Balu
3
Simhachalam
2021-06-16 03:13:36
విజయనగర రాజ వంశంలో కీలకంగా వున్న మాన్సాస్ ట్రస్టుపై హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇపుడు మాన్సాస్ ఏ మలుపు తిరుగుతుందనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది.. ఇప్పటి వరకూ ఆ ట్రస్టుకి చైర్మన్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు వ్యవహరిస్తూ వస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా ఆ ట్రస్టు సంచయిత గజపతిరాజు చేతిలోకి వచ్చింది. చాలా ఏళ్ల తరువాత ట్రస్టు చేతులు మారిందని, దాని రూపు రేఖలు మారుతాయనుకున్న తరుణంలో మళ్లీ హైకోర్టులో అశోక్ గజపతిరాజు తరపున న్యాయవాధి వాదలను వినిపించడంతో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఉత్తరాంధ్రాలోని కీలకమైన అంశంలో ఒక కుదుపు కుదిపిన మాన్సాస్ వ్యవహారంలో ఒకే కుటుంబంలో కూతురు, చిన్నాన్నలు కోర్టుకెళ్లి నువ్వా నేనా అని తలపడిన సమయంలో హైకోర్టు చిన్నాన్న వైపే తీర్పు వెలువడింది. ఈ తీర్పును సవాల్ గా తీసుకున్న ప్రభుత్వం మళ్లీ ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టుకి వెళ్లి పోరాటం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. మాన్సాస్ లో చాలా అవినీతి జరిగిందని, భూములు పక్కదారిపట్టాయని వాటి పరిరక్షిస్తామని చెప్పి ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేయడంతో ఇపుడు మళ్లీ ప్రతిపక్షాలకు ఈ అంశం ప్రధానం అయిపోయింది. అంతేకాదు ఈ విషయంలో ప్రభుత్వాని వ్యతిరేకంగా వున్న మీడియా దీనినే ప్రధాన అంశంగా కూడా చూపిస్తున్న ప్రజలకు రక రకాల ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. ఈ తరుణంలో మాన్సాస్ మరో మలుపు తిరిగి ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుందానే అనుమానాలను విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి చాలా ఏళ్ల నుంచి మాన్సాస్ ట్రస్టును టిడిపి నాయకులు మాజీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు నిర్వహిస్తూ వస్తున్నారు. అదేసమయంలో సింహాచలం ట్రస్టుబోర్టులో కూడా ఈ కుటుంబం నుంచే అనువంశికంగా ధర్మకర్తలు కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా తెరపైకి వచ్చిన సంచయిత గజపతిరాజుని ప్రభుత్వం ప్రమోట్ చేయడం..ప్రత్యేక జీఓల అధికారం చేతిలో పెట్టినా ఫలితం లేకుండా పోయింది. కొద్ది నెలల్లోనే ఆశల సౌధంపై హైకోర్టు తీర్పుఅనే పిడుగు పడటంతో మళ్లీ సింహాచలం ట్రస్టుబోర్టు, మాన్సాస్ వ్యవహారం మొదటికి వచ్చాయి. ఈ విషయం ఏ మలుపు తిరుగుతుందోనని అంతా భావిస్తున్న తరుణంలో ప్రభుత్వంలో ఈ విషయంపై ప్రత్యేక అంశంగా మారింది. ఇపుడు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకి వెళ్లి పైచేయి సాధించాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఈ తరుణంలోనే ప్రభుత్వానికి కోర్టు వ్యవహారాలు అచ్చిరాలేదని అంశం మాన్సాస్ ట్రస్టు మరోసారి రుజువుచేసిందని చెబుతుతన్నారు. ఈ రసవత్తర సమయంలో మాన్సాస్ విషయంలో సంచయిత గజపతిరాజుకి సుప్రీం కోర్టులో ఊరట లభిస్తుందా తిరిగి మళ్లీ మాన్సాస్ కి మహారాణి అవుతుందా..లేదంటే అక్కడ కూడా చుక్క ఎదురై చిన్నాన్న చేతికే మాన్సాస్ ను అప్పగిస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు మాన్సాస్, సింహాచలం ట్రస్టుబోర్టు..చివరిగా సుప్రీంకోర్టు ఏం జరుగుతుందనేది వేచూడాలి..!