శ్రీ వరాహ లక్ష్మీనరసిం హస్వామి దేవస్థానం చేపట్టిన చందన సమర్పణకు దాతలు ఎవరైనా భాగస్వాములు కావచ్చనని సింహాద్రి అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి,వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కోరారు..
బుధవారం సింహాద్రి నాధుడు ని దర్శించుకున్న అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, చందన సమర్పణ లో భాగస్వాములు కావడం దాతలు,భక్తులు పూర్వజన్మ సుకృతంగా భావించాలన్నారు,
అర కేజీ చందన సమర్పణకు 10,116 లు కేజీ చందన సమర్పణకు 20,116 స్వామి దేవస్థానం కు విరాళాలు సమర్పించి చందన ప్రసాదం స్వీకరించాల్సిందిగా శ్రీనుబాబు కోరారు,,ఇప్పటికే రెండు చందన సమర్పణ లు పూర్తి అయ్యాయని,వచ్చే జేష్ఠ పౌర్ణమి, తదుపరి వచ్చే ఆషాడ పౌర్ణమిలలో స్వామికి మూడేసి మణుగుల చొప్పున చందన సమర్పణ గావిస్తారన్నారు, కావున అరుదైన ఈ అవకాశాన్ని భక్తులు,దాతలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు,, దీంతో పాటు గతంలో చేపట్టిన శా0డ్ బ్లాస్టింగ్ పనులు వల్ల ఆలయంలో వర్షం నీరు కారుతుందని కాబట్టి వాటికి మరమ్మతులు చేపట్టేందుకు దాతల సహకారం తీసుకోవాల్సిందిగా ఇప్పటికే తాను ఆలయ ఈఓ ఎంవీ సూర్య కళ ను కోరడం జరిగిందన్నారు,, ఐతే ఆయా పనులు పూర్తిస్థాయిలోచేపట్టెందుకు ప్రాజెక్టు సవివర నివేదిక ను ఈఓ సిద్ధం చేయించారన్నారు..