కోవిడ్ బాధితునికి ఆర్ధిక సహాయం..
Ens Balu
2
Srikakulam
2021-06-16 12:59:23
శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం దండులక్ష్మీపురం గ్రామానికి చెందిన మొయ్యి జగదీష్ నాయుడు కోవిడ్ తో ఇటీవల మరణించారు. వారి కుటుంబ సభ్యులు పెద్ద దిక్కును కోల్పోయి అనాధలుగా మిగిలారు. భార్య కుసుమకుమారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో వారి పిల్లలు చదువుల నిమిత్తం కుమారుడు రుద్రతేజ(బీటెక్), కుమార్తె చాంధిని (ట్రిపుల్ ఐటీ) ల విద్య కొనసాగించేందుకు రాష్ట్ర తూర్పు కాపు సంఘం తరపున రూ.25 వేలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేతులు మీదుగా రాష్ట్ర తూర్పుకాపు బీసీ కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ లు అందజేశారు. మబగాం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు సురంగి మోహనరావు, కరిమి రాజేశ్వరరావు, కరణం శ్రీనివాసరావు, తూర్పుకాపు డైరెక్టర్ లుకలావు రంజిత్ కుమార్, కద్ధాల శ్యామసుందరరావు తదితరులు పాల్గొన్నారు.