పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలి..


Ens Balu
4
Srikakulam
2021-06-16 13:00:21

పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు కోరారు. ఖాజీపేట, కిల్లిపాలేం పంచాయతీలకు మంజూరు అయిన నూతన చెత్త సేకరణ వాహనాలను బుధవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ చెత్తను చెత్త సేకరణ వాహనాల్లో వేయాలన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేస్తూ చెత్త బుట్టలను వాడాలని సూచించారు. వానా కాలంలో మురికి, నిల్వ నీటి ద్వారా అనేక రోగాలు వచ్చే ఆస్కారం ఉందని, ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్., ఎండివో ప్రకాష్ రావు, పంచాయతీ సెక్రటరీలు.,సురంగి మోహన్ రావు, స్థానిక నాయకులు తెలుగు సూర్య నారాయణ,కరమ్ చంద్, గైనేటి చిన్ని, గంగు సీతాపతి, తంగి శ్రీపతి, ధర్మాన అనిల్, తంగి చంద్రశేఖర్, గోలివి రమణ, లక్ష్మణ్ అప్పు యాదవ, కరణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.