కోవిడ్ మూడవ దశ కోవిడ్ వ్యాప్తి చెందితే దానిని పకడ్బందీగా ఎదుర్కొనేందుకు కార్యాచణతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వివిధ కార్య్రమాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ను ముఖ్యమంత్రి బుధ వారం నిర్వహించారు. కరోనా ఎవ్వరికీ ఆర్థిక ఇబ్బంది లేకుండా కర్ఫ్యూ జరిగిందన్నారు. వాక్సినేషన్ తోనే కోవిడ్ నివారణ సాధ్యమౌతుందని ఆయన పేర్కన్నారు. కొవిడ్ నిబధనలను పాటించాలని ఆయన సూచించారు. ఇంటింటి వెళ్లి పరిశీలన చేసి లక్షణాలు ఉన్నవారిని పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 80 శాతం మంది ఆరోగ్య శ్రీ లో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. ప్రజలను మోసం చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కేసులు తగ్గుముఖం పట్టాయని తీసుకోవలసినచర్యలపై అలక్ష్యం వహించారని ఆయన సూచించారు. మూడవ దశను ఎదుర్కొనుటకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. మూడవ దశపై ఊహాగానాలు ఉన్నాయని అనుకోని పరిస్థితుల్లో సంభవిస్తే అందుకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు, పరికరాలు, మందులు లభ్యంగా ఉండాలని ఆయన అన్నారు. చిన్న పిల్లల వైద్యుల జాబితాలు సిద్దంగా ఉండాలని, స్టాఫ్ నర్స్ లకు అవసరమగు శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. మూడవ దశను ఎదుర్కొనుటకు అన్ని విధాలా సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రైతు సంతోషంగా వ్యవసాయం చేయాలని ముఖయమంత్రి అన్నారు. ప్రతి రైతు ఇ - పంటలో నమోదు కావాలని స్పష్టం చేశారు. ఇ - పంట కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ లు తనిఖీ చేయాలని ఆయన పేర్కొన్నారు.జిల్లాలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు తరచూ నిర్వహిస్తూ రైతులకు తగు సూచనలు ఇవ్వాలని ఆయన సూచించారు. బోర్ల కింద వరి పంట వేయకుండా రైతులకు తగు సూచనలు అందించాలని, అందుకు ప్రత్యామ్నాయంగా లాభదాయక పంటలు వేయాలని ఆయన అన్నారు. విత్తనాల సరఫరాలో నాణ్యత పాటించాలని ఆదేశించారు. ఆర్.బి. కే ద్వారా రాయితీ విత్తనాలు అందించాలని ఆయన అన్నారు. ధరల విషయంలో బ్లాక్ మార్కెటింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగ కూడదని ఆయన పేర్కన్నారు. ఆర్.బి. కెల్లో ఎరువుల కొరత అనే అంశం ఉత్పన్నం కారాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఉపాధి హామీ గూర్చి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగవంతం కావాలన్నారు. అన్ని భవనాలు ఒకే వ్యక్తికి అప్పగించే బదులు ఎక్కువ మందికి అప్పగించడం వలన ప్రయోజనం ఉంటుందని ఆయన పేర్కన్నారు. 90 రోజులలో ఇళ్ల పట్టాల కార్యక్రమంపై చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కోర్టు కేసులు ఉంటే త్వరగా పరిష్కారం కావడానికి చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. జగనన్న కాలనీలలో జియో టాగ్గింగ్, మ్యాపింగ్ తదితర అంశాలపై దృష్ట సారించాలని అన్నారు. నీటి సరఫరా, విద్యుత్తు సరఫరా వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ మాసాంతానికి మొదటి దశ ఇళ్ల నిర్మాణంలో అన్ని ప్రారంభం కావాల్సిందే నని ఆయన స్పష్టం చేశారు. బిల్లులను ప్రతి వారం చెల్లిస్తామని ముఖ్య మంత్రి అన్నారు. 22న చేయూత కార్యక్రమం క్రింద ఆర్థిక సహాయం అందించడం జరుగతుందని ఆయన చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ శ్రికేష్ లాఠకర్, ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా. కే. శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్, అర్. శ్రీరాములు నాయుడు, సి.పి.ఓ ఎం. మోహనరావు, వ్యవసాయ శాఖ జెడి కే. శ్రీధర్, డిడి రాబర్ట్ పాల్, గృహ నిర్మాణ సంస్థ పిడి టి. వేణుగోపాల్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్. కుర్మారావు, పంచాయతీ రాజ్ ఎస్.ఇ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.