ఫుట్ పాత్ లు ఆక్రమిస్తే కఠిన చర్యలు..


Ens Balu
6
ఎంవీపికాలనీ
2021-06-16 13:51:18

మహావిశాఖ నగర పరిధిలోని ఫుట్ పాత్ లు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన హెచ్చరించారు. బుధవరం  4వ జోన్ లో ని పాండురంగాపురం, బీచ్ రోడ్, ఎంవిపి కోలనీ సెక్టర్-9, ఫిషర్ మెన్ కోలనీ తదితర ప్రాంతాలలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలోని ఎక్కడా ఫుట్ పాత్ లు ఆక్రమణలు జరగకూడదని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఫుట్ పాత్ లు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గత రెండు రోజులు పారిశుధ్య కార్మీకులు సమ్మె కారణంగా నగరంలో చెత్త పేరుకుపోయినదని, అదనపు గంటలు పనిచేసి చెత్తను ఎత్తించాలని, ప్రతి ఇంటి నుండి తడి-పొడి చెత్తను వేరు వేరుగా తీసుకోవాలని, రోడ్లు, కాలువలు, గెడ్డలలో పేరుకుపోయిన చెత్తను యుద్ధప్రాతిపదికన అదనపు ట్రిప్పుల ద్వారా చెత్తను డంపింగ్ యార్డు లకు తరలించాలన్నారు. భూగర్భ డ్రైనేజి నుండి మురుగు నీరు పొంగకుండా చూడాలని, కాలువలపై ఉన్న డ్రైనేజి పలకలను చెత్త తొలగించిన వెంటనే మూసివేయాలని  అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి నిల్వలు లేకుండా చూడాలని, డంపర్ బిన్లు చుట్టూ బ్లీచింగు జల్లించి, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను అదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్, ఎసిపి భాస్కర్ బాబు, ఇ.ఇ.(మెకానికల్) చిరంజీవి, ఇ.ఇ.(వర్క్స్) శ్రీనివాస్, ఇ.ఇ.(వాటర్ సప్ప్లై) పి. శ్రీనివాసరావు, ఎఎంఒహెచ్ రమణ మూర్తి, శానిటరి సూపర్వైజర్ జనార్ధన్, శానిటరి ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.