చెత్తను వేగంగా తరలించాలి..


Ens Balu
4
విశాఖ సిటీ
2021-06-16 13:53:47

మహావిశాఖ నగర పరిధిలో సేకరించిన చెత్త తరలింపు వేగవంతం చేయాలని జివిఎంసి అదనపు కమిషనర్  డా. వి. సన్యాసి రావు శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. బుధవారం ఆయన ఐదవ జోన్ 45వ వార్డు పరిధిలోని సత్యసాయి కోలనీ, సాలి గ్రామ పురం, గణేష్ నగర్, నరసింహ నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మీకులు గత రెండు రోజుల సమ్మె కారణంగా ప్రతి చోట చెత్త పెరుకుపోయిందని, దానిని యుద్ధ ప్రాతిపదికన తొలగించి, ప్రతీ ఇంటినుండి తడి-పొడి చెత్తను సేకరించి  వాహనం ద్వారా డంపింగు యార్డు కు తరలించాలని ఆదేశించారు. రోడ్లు, కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేలా చర్యలు చేపట్టాలని వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శులను ఆదేశించారు.  డంపర్ బిన్లు చుట్టూ చెత్తను తొలగించాలని, చెత్త తరలించే వాహనాలు అదనపు ట్రిప్పుల ద్వారా చెత్త తరలించి చెత్త నిల్వ లేకుండా చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను  ఆదేశించారు. డంపర్ బిన్లను శుభ్రం చేయాలని, పాడైన డంపర్ బిన్లు రిపేరు చేసి వాటి స్థానంలో అమర్చాలని సూచించారు.  ఈ కార్యక్రమలో శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శులు, పారిశుధ్య సిబ్బంది తదితరులను పాల్గొన్నారు.