రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలు, విలేజ్ క్లినిక్స్ భవనాల నిర్మాణ పనులు నిర్దేశిత సమయంలో పూర్తి చేసే విధంగా పనులు వేగవంతం అయ్యేలా జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ -19 నివారణ చర్యలు, ఉపాధి హామీ పధకం, సచివాలయాలు, ఆర్ బి కే లు, అంగన్ వాడీ కేంద్రాలు, బియంసియులు, ఎఎంసిల భవనాల నిర్మాణ పనులు, డా. వైస్సార్ అర్బన్ క్లీనిక్స్, పేదలందరికీ ఇళ్ళ పధకం ప్లాట్ల పంపిణీ, పక్కా గృహాల నిర్మాణం, 90 రోజుల్లో ఇంటి పట్టాల పంపిణీ, ఖరీఫ్ సన్నద్ధత, జగనన్న శాశ్వత భూ హక్కు పధకం సర్వే పనులపై సమీక్షించి జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ సోకిన పేదవారికి ఆర్దిక భారం లేకుండా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పధకం ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించేలా కృషి చేసిన జిల్లా కలెక్టర్లను అభినందిస్తున్నానన్నారు. ఖరీఫ్ లో సాగు చేసిన ప్రతి ఎకరం ఈ క్రాప్ లో నమోదు అయ్యేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లాల్లో అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై నిరంతరం జిల్లా కలెక్టర్లు సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలోని అధికారులకు అవసరమైన సూచనలు అందించాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో గుంటూరు కలక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ ఆరీఫ్ హాఫిజ్, సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవిన్యూ) ఏ.ఎస్.దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి.ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ (హౌసింగ్) అనుపమ అంజలి, సంయుక్త కలెక్టర్ (ఆసరా,సంక్షేమం)కే. శ్రీధర్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి పి. కొండయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.