శక్తి వంచన లేకుండా పని చేసి లక్ష్యాన్ని చేదించాలని వ్యవసాయ శాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ పై జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీరాములు నాయుడు లతో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్రాప్ ఖచ్చితంగా అమలు చేసి తీరాలన్నారు. ఈ క్రాప్ కు సంబంధించి వివరాలను టం టం, సోషల్ మీడియా, తదితర వాటి ద్వారా రైతులకు తెలియజేయాలన్నారు. రైతులు వద్దకు వెళ్లినప్పుడు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎన్ రోల్ చేసినట్లు రైతులకు ఎకనాలెడ్జ్ మెంట్ ఇవ్వాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పరిశీలించి ఆయా భూముల్లో ఏ ఏ పంటలు ఉన్నాయో తెలియజేయాలన్నారు. జెసి సుమిత్ కుమార్ మాట్లాడుతూ ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న తర్వాత ఎంట్రీ సరిగా ఉందా లేదా అని సంబంధిత రైతులకు చూపించాలని చెప్పారు. ప్రైస్ మోనిటరింగ్ కమిటీ కు సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పై జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు. జిల్లా స్థాయిలోనే ధరలను నిర్ణయించాలని కమీషనర్ చెప్పారు.
రైతులకు ప్రొవిజనల్ గా మంజూరు చేయాలని ఎడిలను కమిషనర్ అరుణ్ కుమార్ ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ధరలు సరి చూసుకుని రైతులకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ట్రాక్టర్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ లేబ్స్ త్వరితగతిన పూర్తిచేయాలని కమిషనర్ అరుణ్ కుమార్ ఆదేశించారు. నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సింటెక్స్ వాటర్ ట్యాంక్ లు,. ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. రణస్థలం, రాజాం, ఆముఉదాలవలస, కొత్తూరు మండలాల నియోజక వర్గాల ఆగ్రో లేబ్స్ జూలై 8 నాటికి అందజేయనున్నట్లు సంబంధిత డిఈ చెప్పారు. మిగిలిన వాటిని ఆగస్టు నాటికి అందజేయనున్నట్లు తెలిపారు.
విత్తనాలు పంపిణీలో సమస్యలు లేకుండా చూడాలని ఎడిలను ఆయన ఆదేశించారు.వ్యవసాయ మందులు కనీసం రైతు భరోసా కేంద్రాల వద్ద కనీసం 5 టన్నులు పెట్టుకోవాలన్నారు. ఎరువులు, పురుగు మందులు, తదితరమైన అన్ని రకాల మందులు ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ డిడి పాల్ రాబర్ట్ కమిషనర్ కు వివరించారు. ఆర్.బి.కె. ల్లో వ్యవసాయ సంబంద ఎరువులు, మందులు కొనుగోలు చేస్తే రైతులకు ఒక భరోసా ఉంటుందని కమీషనర్ చెప్పారు.
జిల్లాలో పండించే పంటలు గూర్చి జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ కమిషనర్ కు వివరించారు. కలుపు నివారణ మందులు, తదితర పోస్టర్ లను విడుదల చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, వ్యవసాయ శాస్త్రవేత్త పివి సత్యనారాయణ, వంశధార ప్రాజెక్టు ఎస్ఈ డి. తిరుమలరావు, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాబర్ట్ పాల్, వ్యవసాయఆగ్రోస్ డిఎం కె. జగన్ మోహన్ రావు హార్టీ కల్చర్ ఎ.డి., రాగోలు వ్యవసాయ కేంద్రం ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.