ఇంటి పోషకుడికి భీమా కల్పించాలి..


Ens Balu
2
Anantapur
2021-06-16 15:10:23

వైఎస్సార్ బీమా పథకానికి సంబంధించి రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబ పోషకుడికి బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు.  బుధవారం అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు,  డిఆర్డిఎ పిడి లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించనున్నామన్నారు. బీమా సౌకర్యానికి అర్హులు , వారి నామినీల నుంచి బయోమెట్రిక్ డేటా సేకరించాలన్నారు.   జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ 18 నుండి 50 సంవత్సరాలు ఉన్న వారు సాధారణ మరణం చెందితే లక్ష రూపాయలు, 18 నుండి 70 సంవత్సరాలు కలిగి ప్రమాద వశాత్తూ మరణిస్తే వారికి రూ.5 లక్షలు బీమా సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని రూపొందించిందని తెలిపారు. వాలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్ లు పారదర్శకంగా సర్వే చేసి పది రోజుల్లోగా ఆన్లైన్ లో బీమా హక్కుదారులు, నామినీల వివరాలు నమోదు చేయాలన్నారు. జూలై ఒకటవ తేదీ నుండి అమలు కానున్న వైయస్సార్ చేయూత లో మిగిలిన వారి వివరాలను త్వరతగతిన నమోదు చేయాలని ఆదేశించారు.  ఈ సందర్భంగా బీమా హక్కు దారులతో పాటు నామినీల నుంచి కూడా బయోమెట్రిక్ వివరాల సేకరించడంలో ఇబ్బందులున్నాయని డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి విన్నవించారు. చాలా సందర్భాల్లో నామినీలు ఒక చోట, బీమా లబ్ది దారులు ఒక చోట ఉండటం వల్ల ఇద్దరి వివరాలు సేకరించడం సమస్యగా మారిందన్నారు. కార్యక్రమంలో డీపీఎం సత్యనారాయణ తదితరులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.