నాడు-నేడు పనులు వేగవంతం చేయాలి..
Ens Balu
2
Kakinada
2021-06-16 15:19:29
నాడు - నేడు కార్యక్రమం కింద అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో చేపట్టిన పనులు వేగవంతం చేసి పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నాడు - నేడు కార్యక్రమం కింద ఆస్పత్రులలో చేపట్టిన పనుల పురోగతిపై జిల్లా వైద్య అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో జేసీ కీర్తి చేకూరి సమీక్షించారు.జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లకు వచ్చే ప్రజలకు పూర్తిస్థాయిలో అన్ని సేవలు అందించే విధంగా ఆసుపత్రులలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. పనులలలో నాణ్యత ప్రమాణలను మరింత మెరుగుపరుచుకుని నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ కు జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రులు స్థానం సంపాదించి విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.సమర్థవంతమైన ఐఇసి, సిగ్నేజీలు, ల్యాండ్‌స్కేప్ మొదలైన వాటిని ఉపయోగించడం ద్వారా అన్ని పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలలో నాణ్యతను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. కె వి ఎస్ గౌరీశ్వర రావు, ఇతర వైద్య అధికారులు,ఆర్‌అండ్‌బి, ఎపిఎంఐఎస్‌డిసి, ఎన్‌హెచ్‌ఎం, జిల్లా నాణ్యత బృందం, మండల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.