కోవిడ్ లో ఖైదీల బాగోగులపై ఆరా..
Ens Balu
3
Vizianagaram
2021-06-16 15:26:10
జైళ్లలో వివిధ రకాల శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు బాగోగులపై సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి. లక్ష్మీరాజ్యం ఆరా తీశారు. జిల్లా జైళ్ల సూపరింటెండెంట్ మరియు జిల్లాలోని సబ్ జైళ్ల సూపరింటెండెంట్స్‌తో ఆమె బుధవారం వర్చువల్ విధానంలో మాట్లాడారు. జైళ్లలో విధులు నిర్వహించే సిబ్బంది, శిక్షలు అనుభవించే ఖైదీలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్స్‌కు సూచించారు. వివిధ రకాల శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు క్రమ శిక్షణతో కూడిన మంచి నడవడిక కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు. అనంతరం ఉచిత న్యాయం, బెయిల్, ఆహారం తదితర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం హై పవర్ కమిటీ ద్వారా సబ్ జైళ్లలోని శిక్ష పడిన ఖైదీలలో అర్హులైన కొందరిని బెయిల్, ఇండెర్స్ బెయిల్ ద్వారా విడుదల చేయటం గురించి చర్చించారు. జిల్లాలో ఐదుగురు బెయిల్పై విడుదలకు అర్హత సాధించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా సబ్ జైళ్ల అధికారి మధుబాబు, విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి, పార్వతీపురం సబ్ జైళ్ల సూపరింటెండెంట్‌లు టి. దుర్గారావు, ఎస్.కె. మదీన, కృష్ణమూర్తి, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.