అనాధపిల్లలకు ప్రభుత్వం అండ..


Ens Balu
3
ఒంగోలు
2021-06-16 15:41:46

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం  విద్యుత్ గెస్ట్ హౌస్ లో కోవిడ్ తో తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు 10,00000 రూపాయలు చెక్కును  మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ కారణంగా అనాధలైన పిల్లలను ఆదుకోవడానికి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ఉదారంగా ఆలోచించారని అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ  సిద్ధార్థ కౌశల్, ఐ.సి.డి.ఎస్ పి.డి.జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.