అనంతపురం లోని రాం నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బి, ట్రాన్స్ కో అధికారులకు మేయర్ వసీం సూచించారు. బుధవారం మేయర్ ఛాంబర్ లో తొలుత ఆయా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాం నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తైనా సర్వీస్ రోడ్ పనులు అర్దాంతరంగా అపి వేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు. సర్వీస్ రోడ్ తోపాటు డ్రైనేజీలు పనులు కూడా చేపట్టక పోవడంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని సూచించారు. అదే విధంగా రాం నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్ లో విద్యుత్ అధికారులు విద్యుత్ స్తంభాలు,డి పి లను మార్చక పోవడంతో రోడ్ మధ్యలో వాహనదారులకు ఇబ్బంది గా మారాయని వాటిని కూడా వెంటనే మార్చాలని సూచించారు. దీనితోపాటు నగరంలో విద్యుత్ లైన్ లకు అడ్డుగా ఉన్నాయని చెట్ల కొమ్మలను తొలగించి ఎక్కడివి అక్కడే రోడ్డుపై వదిలేసి వెళ్తున్నారని ఇకపై మీరు తొలగించిన కొమ్మలను మీరే తరలించాలని విద్యుత్ సిబ్బందికి మేయర్ సూచించారు. అనంతరం రాం నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్ ప్రాంతంలో మేయర్ వసీం తో పాటు నగర కమిషనర్ పివీవీఎస్ మూర్తి ట్రాన్స్ కో,ఆర్ అండ్ బి అధికారులు పర్యటించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు అనీల్ కుమార్ రెడ్డి,బాబా ఫక్రుద్దీన్,డివిజన్ కన్వీనర్ ప్రకాష్ రెడ్డి, ఎస్ సి రమేష్ చంద్ర,ఈ ఈ రామ్మోహన్ రెడ్డి,ఆర్ అండ్ బి ఈ ఈ చంద్రశేఖర్ రెడ్డి , ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏడిఈ ఉమాపతి, ఏ ఈ రవీంద్ర, కాంట్రాక్టర్ పద్మాకర్ బాబు రఘునాథ్ రెడ్డి,డి ఈ బాల సుబ్రమణ్యం,టౌన్ ప్లానింగ్ ఏసిపి రామలింగేశ్వర్, సర్వేర్ కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.