బ్రిక్స్ సమావేశాల్లో బిఎంఎస్ కీలకం..
Ens Balu
4
Visakhapatnam
2021-06-17 02:41:17
భారత దేశంలో బ్రిక్ సమావేశాల్లో బీఎంఎస్(భారతీయ మజ్దూర్ సంఘ్) కీలకం వ్యవహరించనుందని బిఎంఎస్, భారతీయ టెలీకాం ఎంప్లాయిస్ యూనియన్ నేషనల్ ప్రెసిడెంట్ వివిఎస్ సత్యన్నారాయణ అన్నారు. విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై నెలలో జరగనున్న బ్రిక్ సమావేశాల్లో బిఎంఎస్ అన్ని విభాగాల డెలిగేట్స్ పాల్గొంటారని అన్నారు. ఇంతటి కీలకమైన సమావేశాల్లో బీఎంఎస్ కీలకంగా వ్యవహరించడం ద్వారా దేశంలో బిఎంఎస్ ప్రాముఖ్యత మరోసారి తెలుస్తుందన్నారు. ఇప్పటికే ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం అహర్నిసలు పనిచేస్తున్న బిఎంఎస్ ఇపుడు బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనడం ద్వారా దేశంలో ఏ యూనియన్ కి దక్కని గౌరవం దక్కుతుందన్నారు. ఈ విషయంలో విశేషంగా క్రుషిచేసిన జాతీయ నాయకులు, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న నేతలకు, డెలిగేట్స్ కు వివిఎస్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. బిఎంఎస్ భారతదేశ యూనియన్లంటికంటే అత్యంత కీలకమనే విషయం బ్రిక్స్ సమావేశాల ద్వారా మరోసారి నిరూపణ అవుతుండటం ఆనందంగా వుందన్నారు. ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పనిచేసే బీఎంఎస్ కి బ్రిక్స్ సమావేశాల్లో కీలకంగా వ్యవహరించడం ద్వారా తమపై మరింత బాధ్యత పెరుగనుందని వివరించారు.