జీవిఎంసీలో అధికారుల జూ.. లకటక..!


Ens Balu
2
GVMC office
2021-06-17 04:53:00

మహావిశాఖ నగర పాలక సంస్థలో అధికారంలో వున్న సిట్టింగ్ ప్రజాప్రతినిధుల సిఫార్సులన్నీ బుట్టదాఖలవుతున్నాయి.. తమ శాఖ మంత్రి చేసిన సిఫార్సులు, టిడిపి ప్రభుత్వంలోని ఓ మంత్రికి  వర్గానికి చెందిన వారు చేసే సిఫార్సులు తప్పా.. మిగిలిన అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫార్సులు చెల్లుబాటు కావడం లేదు. పదేళ్లపాటు పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారికి ఏదో సహాయం చేద్దామని చేస్తున్న సిఫార్సులను జీవిఎంసీ అధికారులు  కావాలనే తోసిపుచ్చేస్తున్నారు.. వారి మట్టుకి వారు సిఫార్సు చేస్తే ఆ పోస్టు ఖాళీగా వున్నా.. అందులో సిబ్బందిని నియమించే అవకాశం వున్నా..వారికే ఎందుకివ్వాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మీరా కాస్త గట్టిగా అడిగితే ఆ స్థానాలు ఖాళీలు లేవని..అందులో సిబ్బంది పనిచేస్తున్నారని నాయకులను ఫోన్లోనే బురిడీ కొట్టించేస్తున్నారు.. దీనితో మంత్రుల సిఫారసులకు కూడా విలువ లేకుండా పోతే ఇక్కడ ఆ అధికారులు ఉంచాలా అనే వాదన బలంగా వినిపిస్తుంది.. అంతేకాదు  కావాలనే జోనల్ కమిషనర్ క్యాడర్ స్థాయి అధికారులను స్థాయి తగ్గించి చిన్న పోస్టుల్లో డిప్యుటేషన్ వేసి కూర్చోబెట్టి బలవంతంగా విధులు చేయిస్తున్నారు ఇక్కడి అధికారులు.  జీవిఎంసీలో కొన్నిస్థానాలను, పోస్టులను ఔట్ సోర్సిగ్ ద్వారా భర్తీచేసుకునే అవకాశం వున్నప్పకిటీ కావాలనే పనిచేస్తున్న సిబ్బందికే వాటి డిప్యుటేషన్లు బాధ్యత కట్టబెడుతున్నారు. దీనితో సదరు ఖాళీలలో అర్హతులుండీ బాగా పనిచేయగల సామర్ధ్యం ఉన్నవారిని ఆ ఖాళీల్లోకి తీసుకోవాలని ప్రజాప్రతినిధులు స్వయంగా ఫోన్ చేసిన చెప్పినా ఆ ఒక్కటీ అడక్కు అనే చందాన...ఆ పోస్టు ఖాళీగా లేదండీ ఖాళీ అయితే చూద్దామని తెగేసి చెప్పేస్తున్నారు. ఒక్కో అధికారికి రెండు మూడు విభాగాలు డిప్యుటేషన్లు వేస్తున్నారు..ఆ విషయాన్ని నేరుగా డిప్యుటేషన్ విధులు నిర్వహిస్తున్న వారే సహచర ఉద్యోగుల దగ్గర చెప్పి బోరున విలపిస్తున్నారు. పనిచేసేవారికే అదనంగా డిప్యుటేషన్లు వేయడంతో ప్రభుత్వం ద్రుష్టిలో ఆ పోస్టులు బర్తీచేయకుండా, ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీచేసుకునే వీలుకూడా లేకుండా పోతుంది. చాలా కాలం తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ఇంత వరకూ కష్టపడి పనిచేసిన వారికి ఈ ప్రభుత్వంలో కూడా మనకి ఎలాంటి సహాయం దక్కేలా లేదు అనేట్టుగా వ్యవహరిస్తున్నారు. అలాగని అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఇతర విభాగాల్లో ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఆయా సర్వీసుల నుంచి వచ్చేవారిని నియమిస్తున్నారా అంటే అదీలేదు.. ప్రజా ప్రతినిధుల సిఫార్సుల మేరకు రెవిన్యూ సర్వీసు కేడర్ పోస్టులో కోపరేటివ్ సర్వీసు ఉద్యోగులను నియమిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా జివిఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నప్పటికీ ఏ ప్రజాప్రతినిధి నోరు విప్పే పరిస్థితి లేదు. దీనితో జీవిఎంలోని కొందరు అధికారులు తమ అధికారం, పవర్ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వద్దే చూపిస్తున్నారు. ఈ విషయం కాస్త ఇక్కడి స్థానం కోసం ఎదురు చూస్తున్న కొందరు ఐఏఎస్ ల వరకూ చేరడంతో వారు జీవిఎసీకి వైపు చూస్తున్నారని తెలిసింది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్టు సమాచారం. కాకపోతే తమ శాఖ మంత్రి తనకు పూర్తి వెన్నుదన్నుగా వున్నారనే ధీమా కూడా జివిఎంసీ అధికారుల్లో పెరిగిపోవడం కూడా చర్చనీయాంశం అవుతుంది. అధికారంలో వున్న ప్రజాప్రతినిధుల ద్వారా పనులు జరగకపోతే ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం కూడా లేకపోలేదు. కాకపోతే జిల్లా అధికారులు మంత్రుల సిఫార్సులకి విలువ ఇస్తున్నా..కేవలం జీవిఎంసిలో మాత్రం అవి చెల్లుబాటు కాకపోవడం కూడా ఇపుడు హాట్ టాపిక్ అవుతోంది..!